ఒక గ్రూప్‌లో ఒకటి కంటే ఎక్కువ కరెన్సీలు ఉపయోగించవచ్చా?
అవును. ప్రతి గ్రూప్‌కు ఒక డిఫాల్ట్ కరెన్సీ ఉంటుంది, ప్రతి ఖర్చు వేరే కరెన్సీని ఉపయోగించవచ్చు. విదేశీ ట్రిప్‌లలో ఇది ఉపయోగపడుతుంది.
దశలు
- ఖర్చును జోడించేటప్పుడు లేదా సవరించేటప్పుడు, మొత్తం పక్కన ఉన్న కరెన్సీ గుర్తును నొక్కి కరెన్సీని ఎంచుకోండి.
- గ్రూప్ డిఫాల్ట్‌ను మార్చడానికి, గ్రూప్ సెట్టింగ్‌లు (Group settings) తెరిచి డిఫాల్ట్ కరెన్సీ (Default currency) నొక్కండి. గ్రూప్ అడ్మిన్లు మాత్రమే దీన్ని మార్చగలరు.
SplitEase కరెన్సీల మధ్య మార్పిడి చేయదు. బ్యాలెన్స్‌లు, లెక్క తేల్చాల్సిన మొత్తాలు ప్రతి కరెన్సీకి విడిగా చూపబడతాయి.
కొత్త గ్రూప్‌ల కరెన్సీ ప్రొఫైల్ (Profile) → కరెన్సీ (Currency) నుండి వస్తుంది.
SplitEase యాప్ ఇంకా తెలుగులో అందుబాటులో లేదు. బ్రాకెట్లలో ఉన్న బటన్ పేర్లు మీకు స్క్రీన్‌పై ఇంగ్లీష్‌లో కనిపించేవి.