ఖర్చును ఎలా జోడించాలి?
గ్రూప్ అంతా పంచుకునే దేనికైనా ఎవరైనా చెల్లించినప్పుడు ఖర్చును జోడించండి. మీరు సేవ్ చేసిన వెంటనే SplitEase అందరి బ్యాలెన్స్‌ను అప్‌డేట్ చేస్తుంది.
దశలు
- ట్యాబ్ బార్ మధ్యలో ఉన్న + బటన్‌ను నొక్కండి, లేదా గ్రూప్‌ను తెరిచి ఖర్చు జోడించు (Add expense) నొక్కండి.
- పైన గ్రూప్‌ను సరిచూసుకుని, మొత్తం (Amount) మరియు అది దేని కోసమో నమోదు చేయండి.
- చెల్లించినవారు (Paid by) కింద, ఎవరు చెల్లించారో ఎంచుకోండి.
- పంపకం (Split) కింద, ఖర్చును ఎవరు పంచుకుంటారో, ఎలాగో ఎంచుకోండి. డిఫాల్ట్‌గా సమానంగా పంచుతారు.
- సేవ్ చేయి (Save) నొక్కండి.
వివరణ ఆధారంగా SplitEase ఒక కేటగిరీని సూచిస్తుంది. సేవ్ చేసే ముందు దాన్ని మార్చవచ్చు.
వేరే కరెన్సీలో చెల్లించాలంటే, మొత్తం పక్కన ఉన్న కరెన్సీ గుర్తును నొక్కండి.
SplitEase యాప్ ఇంకా తెలుగులో అందుబాటులో లేదు. బ్రాకెట్లలో ఉన్న బటన్ పేర్లు మీకు స్క్రీన్‌పై ఇంగ్లీష్‌లో కనిపించేవి.