రసీదును స్కాన్ చేసి ఖర్చును ఎలా జోడించాలి?
రసీదు స్కానింగ్ బిల్లు నుండి మొత్తం, వివరాలను చదువుతుంది, కాబట్టి మీరు టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఇది SplitEase+లో భాగం.
దశలు
- + బటన్‌ను నొక్కి, ఆపై స్కాన్ (Scan) నొక్కండి.
- పూర్తి బిల్లును ఫోటో తీయండి, లేదా మీ దగ్గర ఇప్పటికే ఉన్న ఫైల్‌ను ఉపయోగించడానికి గ్యాలరీ (Library) లేదా PDF ఎంచుకోండి.
- SplitEase కనుగొన్న వివరాలను సరిచూసి ఉపయోగించు (Use) నొక్కండి.
- ఎవరు చెల్లించారో, ఎలా పంచారో సమీక్షించి, సేవ్ చేయి (Save) నొక్కండి.
చిత్రాన్ని చదవడానికి అది SplitEaseకు అప్‌లోడ్ చేయబడుతుంది. దాన్ని ఎలా నిర్వహిస్తామో తెలుసుకోవడానికి మా గోప్యతా విధానం చూడండి.
స్కాన్‌లలో పొరపాట్లు జరగవచ్చు. సేవ్ చేసే ముందు ఎప్పుడూ మొత్తాన్ని సరిచూసుకోండి.
SplitEase యాప్ ఇంకా తెలుగులో అందుబాటులో లేదు. బ్రాకెట్లలో ఉన్న బటన్ పేర్లు మీకు స్క్రీన్‌పై ఇంగ్లీష్‌లో కనిపించేవి.