ఒకరితో లెక్క ఎలా తేల్చాలి?

ఎవరు ఎవరికి ఎంత ఇవ్వాలో SplitEase ట్రాక్ చేస్తుంది, కానీ చెల్లింపులను నిర్వహించదు. మీరు సాధారణంగా చెల్లించే విధంగా అవతలి వ్యక్తికి చెల్లించి, ఇద్దరి బ్యాలెన్స్‌లు అప్‌డేట్ అయ్యేలా యాప్‌లో నమోదు చేయండి.

దశలు

  1. గ్రూప్‌ను తెరిచి లెక్క తేల్చు (Settle up) నొక్కండి.
  2. మీరు ఎవరికైనా చెల్లించి ఉంటే, వారి పేరు పక్కన చెల్లింపు నమోదు చేయి (Record payment) నొక్కి, మొత్తాన్ని సరిచూసి, నిర్ధారించండి. మీరు ఇవ్వాల్సిన దానిలో కొంత భాగాన్ని కూడా నమోదు చేయవచ్చు.
  3. ఎవరైనా మీకు చెల్లించి ఉంటే, వారి పేరు పక్కన అందినట్లు గుర్తించు (Mark as received) నొక్కి, నిర్ధారించండి.

గత చెల్లింపులను చూడటానికి, అదే స్క్రీన్‌పై చరిత్ర (History) నొక్కండి.

SplitEase యాప్ ఇంకా తెలుగులో అందుబాటులో లేదు. బ్రాకెట్లలో ఉన్న బటన్ పేర్లు మీకు స్క్రీన్‌పై ఇంగ్లీష్‌లో కనిపించేవి.

సంబంధిత ప్రశ్నలు

ఇంకా సహాయం కావాలా?

మాకు రాయండి, SplitEase బృందంలోని ఒక వ్యక్తి సమాధానం ఇస్తారు.

సపోర్ట్‌ను సంప్రదించండి
భాష: తెలుగు